Like this Page: https://www.facebook.com/hindutemplesinfo
ఏదేవాలయానికి వెళ్ళినా మనం ముందు ఆ గర్భగుడి చుట్టూ, ముమ్మారు ప్రదక్షిణ కావించాకే మూలవిరాట్టును దర్శించడం వాడుక . ప్రదక్షిణాన్ని ‘పరిక్రమము’ అనికూడా అంటారు. అంటే దైవం చుట్టూతిరగడం. ఈ ప్రదక్షిణ ఎలా చేయాలంటే గబగబా ఎవరో వెనుక నుంచీ తరుముకు వస్తున్నట్లు కాక, నిండుగర్భిణి తలపై నూనె పాత్ర వుంచుకుని ఆనూనె బొట్లు క్రింద పడకుండా ఎలా మెల్లిగా అడుగులో అడుగేస్తూ నడుస్తుందో అలా అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలని శాస్త్రం చెపుతున్నది. ఐతే మనం గబగబా ముగించుకుని వెళ్ళాలనే తొందరలో నడక పోటీవలె చేస్తాం.
మెల్లగా నడుస్తూ చేతులు జోడించుకుని దేవుని ధ్యానిస్తూ, లేదా ఏదైనా ఆదేవునికి సంబంధించిన మత్రాన్ని లేదా శ్లోకాన్ని జపిస్తూ ప్రదక్షిణ కావించాలి. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది. ఏవైనా గ్రహాచారాలు బాగలేక పోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే పరిహారం ఉంటుందని హిందూ ధర్మ శాస్త్రాలు చెప్తున్నాయి.
ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా రకాలున్నాయి. మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒకవిధమైన ప్రదక్షిణ. చండీశ్వరుడున్న శివాలయంలో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి చండీ ప్రదక్షిణం అని అంటారు. సాధారణంగా శివాలయాల్లో 'మహాప్రదక్షిణ' చేస్తారు. బలిపీఠం నుండీ మొదలుపెట్టి ఆలయం చుట్టి తిరిగి ధ్వజస్తంభం [బలిపీఠం] వరకూ చుట్టాక, తిరిగి వెనక్కు ప్రదక్షిణ ధ్వజస్థంభంవరకూ చేయటం.అంటే ఒక ప్రదక్షిణ ఒక అప్రదక్షణ కల్సి మహా ప్రదక్షిణ అన్నమాట. ఇలా శివునికి ఒక్క మహాప్రదక్షిణ ఆచరిస్తే చాలు..ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేస్తాం.
గుడులలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మ ప్రదక్షిణ నిషిధ్ధం. ఆలయంలోని దైవం విశ్వశక్తి కేంద్రబిందువునకు ప్రతీక కనుక, ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటే ఒక చుట్టు (ఆవృతం). జననం నుంచి మరణం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం . ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన గత జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగించుకోవచ్చు. అంతే కాక అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం .
మన మనోవాఃక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణ లోని ప్రధానోద్దేశ్యం. దేవాలయంలో ప్రదక్షిణము వలెనే తులసి కోట ప్రదక్షిణము, అశ్వత్థ ప్రదక్షిణము, గో ప్రదక్షిణము, భూప్రదక్షిణము, కులశైల ప్రదక్షి ములు ఒక దాని కంటె ఒకటి ఉత్తమమైనవి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసే ప్రదక్షిణలు ఒకదాని కంటె ఒకటి పది రెట్లు ఫలితాన్నిస్తాయి. ఉదయ సాయంకాల వేళల్లో సూర్య ప్రదక్షిణము ఉత్తమోత్తమము. సర్వసిద్ధిదాయకము, ఆరోగ్యప్రదము అంటారు పెద్దలు. శ్రీ రమణ మహర్షి 'ప్రదక్షిణం' అన్న పదానికి ఇలా వివరణ నిచ్చారు. 'ప్ర' అనే అక్షరం సమస్త పాపాల నాశనం చేస్తుంది.'ద' అంటే కోరికలన్నీ తీరడమని,'క్షి' అన్న అక్షరం రానున్న జన్మల క్షయాన్ని సూచిస్తుంది. 'న' అంటే అజ్ఞానం నుండి విముక్తి అని చెప్పారు.
ప్రదక్షిణాలలో రకాలు:
ఆత్మ ప్రదక్షిణము : తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణం, దీన్ని మన గృహాల్లో పూజలు, వ్రతాల అనంతరం చేయటం వాడుక..
అంగ ప్రదక్షిణము : నేలపై బోర్లాపడుకుని అవయవాలన్నీ నేలకు తగిలేలాగా దొర్లుకుంటూ గుడిచుట్టూ చేసే ప్రదక్షిణం. తిరుపతిలో ఇలా అంగ ప్రదక్షిణలు చేయటం జరుగుతున్నది.
గో ప్రదక్షిణం : ఆవు ఈనే సమయంలో చేసే ఈప్రదక్షిణ సర్వ శుభకరం.
గిరి ప్రదక్షిణము : దేవుడు కొలువుండే కొండ చుట్టు చేసే ప్రదక్షిణం. శ్రీకృష్ణుడు యాదవులచే గోవర్ధనగిరి ప్రదక్షిణను ఆచరింపజేశాడు. కనుక ప్రదక్షిణము అనేది భగవంతుని సేవించడంలో పరమ పవిత్రమైనదిగా మనకు అర్ధమవుతున్నది.

No comments:
Post a Comment