Chilukur Balaji Temple - HYDERABAD.


చిలుకూరు బాలాజీ టెంపుల్

చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి విననివాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. హైదరాబాదు పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండీ చిలుకూరు బాలాజీ భక్తులు టెంపుల్ కు వస్తున్నారు. అంతకుముందు చిలుకూరు బాలాజీ టెంపుల్ అనామకంగా ఉన్నప్పటికీ ఈమధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందింది.


ఒక పదిహేను ఏళ్లుగా ఎక్కడెక్కడి నుంచో చిలుకూరు బాలాజీ భక్తులు పోటెత్తి వస్తున్నారు. హైదరాబాదు నగర శివార్లలో ఉన్నఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేక సందర్భాల్లో కిక్కిరిసిన జనంతో తిరుమలను తలపిస్తుంది.

చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళిన భక్తులు 11 ప్రదక్షిణాలు చేసి, మొక్కుకుంటారు - తమ కోరిక నెరవేరగానే మరోసారి గుడికి వెళ్ళి 101 సార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే చిలుకూరు బాలాజీ భక్తుల కష్టాలు తీరతాయని, ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న విద్యార్థులకు వీసా వస్తుందని విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకం ఎంతగా బలపడిందంటే చిలుకూరు బాలాజీకి వీసా వెంకటేశ్వరుడనే పేరు స్థిరపడింది.

ఇటీవలికాలంలో ఇంతగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ టెంపుల్ నిజానికి ఇప్పటిది కాదు. ఉస్మాన్ సాగర్ తీరంలో ఉన్న ఈ చిలుకూరు చాలా పురాతనమైంది. చిలుకూరు పది, పన్నెండు శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి. అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నలు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్నారు. అంటే భద్రాచలం రామాలయం కంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ పురాతనమైంది...


No comments:

Post a Comment